తెలంగాణ తల్లికి పూలమాల
చొప్పదండి, జూన్ 7 (విజయక్రాంతి): చొప్పదండి పట్టణంలో తెలంగాణ తల్లికి పూలమాల వేసి తెలంగాణ రక్షణ సేన జెండా పండగ కార్యక్రమాన్ని చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి మ్యాకల తిరుపతి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దినికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ,చొప్పదండి నియోజకవర్గం నాయకులు గుండేటి తిరుపతి గారు, ఏనుగు మల్లారెడ్డి గారు పిట్టల సత్యం,శ్రీ రాముల రమేష్,కుతాడి శ్రీనివాస్, వెంకటేష్, రత్నాకరచారి, లింగంపల్లి శ్రీనివాస్,తిరుపతి చంటి శ్రీనివాస్, రాజీ, పవన్, బషీర్, కైపు ,చందు అంజలి, అపర్ణ, అలేఖ్య, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ
కోనరావుపేట, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కోనరావుపేట మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సీనియర్ నాయకుడు నూనె మల్లేష్ యాదవ్, మండల ఇంచార్జ్ కులేరు వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ అబ్జర్వర్ ఎత్తరి మారయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ వరద సతీష్ కుమార్, సంకెపల్లి సుమలత సుధాకర్ శర్మ, గుంటుక సంపత్ ,తోట కనకయ్య, సాలెంద్ర నవీన్, లక్కం సతీష్, సాయి ప్రణీత్, బయికడి ఆంజనేయులు, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల రమేష్, కదిరే భాస్కర్, జావీద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






