1 August, 2026 | 12:51 PM

భోగాపురం విమానాశ్రయం.. ఉత్తరాంధ్రకు 'సింహ ద్వారం'

01-08-2026 12:14 PM

ఉత్తరాంధ్ర ప్రజలకు కలలకు రెక్కలు

ప్రపంచం గర్వించ దగ్గ నాయకుడు మోదీ

 భోగాపురం అభివృద్ధికి బీజం వేసింది.. చంద్రబాబే

విజయనగరం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram) ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Ram Mohan Naidu) మాట్లాడుతూ... ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. ఈ విమానాశ్రయంతో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయం.. ఉత్తరాంధ్రకు సింహద్వారం అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎర్రబస్సులు తిరిగే ప్రాంతమని కొందరకు ఎగతాళి చేశారని ఆగ్రహించిన ఆయన ఎర్రబస్సులు కాదు.. ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతమని నిరూపించామని వెల్లడించారు.

ఎక్కడా జరగని అభివృద్ధి ఉత్తరాంధ్రలో జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల(People of Uttarandhra) పండుగకు నిజమైన అర్థం సాకారం చేశామని సూచించారు. మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) పేరు చెప్పుకుంటారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు వచ్చాయని కేంద్రమంత్రి(Union Minister ) రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర నుంచి లక్షల మంది వలస వెళ్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని దశాబ్దాలుగా ఇక్కడి యువత ఎదురుచూస్తోందన్నారు. భోగాపురం అభివృద్ధికి బీజం వేసింది.. చంద్రబాబు నాయుడేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.