6 May, 2026 | 11:48 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం

10-12-2024 05:37 PM

బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గారడి ఆరు అబద్ధాలు 66 మోసాలపై జిల్లా కేంద్రంలోని వొడపల్లి గార్డెన్ లో నిర్వహించిన బహిరంగ సభకు సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నక విజయ్, నియోజకవర్గ కన్వీనర్ సోల్లు లక్ష్మి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ తో కలిసి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కోట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తామిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మార్చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభయాస్తాం రాష్ట్ర ప్రజల పాలిట భస్మాసుర హస్తంలో మారిందన్నారు. రాష్ట్రంలో వారు నిర్వహించినవి విజయోత్సవాలు కావని వైఫల్యోత్సవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.