గురుకుల కళాశాలను తనిఖీ చేసిన జిల్లా మాధ్యమిక అధికారి
10-12-2024 05:41 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): బోథ్ బాలికల గురుకుల కళాశాలను జిల్లా మాధ్యమిక అధికారి రవీందర్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని రికార్డులను పరిశీలించి, సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలు సమయం దగ్గర పడుతున్న సందర్భంగా విద్యార్థులు ప్రణాళికతో చదవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్షల గురించి సలహాలు సూచనలు చేశారు. జంబ్లింగ్ విధానంలో జరిగే పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంగీత, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సీనియర్ లెక్చరర్ రవికుమార్, లతా, తేజస్విని, శాలిని, అపర్ణ, సుప్రియ తదితరులు ఉన్నారు.






