పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్/పెంచికల్పేట్, జూన్ 5(విజయ క్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెంచికల్పేట్ ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలామణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఎఫ్డీవో అప్పయ్యలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
అనంతరం కాగజ్నగర్ మండలం కొత్తసార్సాలా వద్ద ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేసి, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన వర్షాకాల సన్నాహక సమావేశంలో ప్రకృతి విపత్తుల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.






