18 August, 2026 | 12:27 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

16-04-2025 07:02 PM

సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు...

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు గంధం సైదులు తహసీల్దార్ ను కోరారు. బుధవారం మండల కేంద్రంలో గతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పోసుకున్న ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు, కొన్ని రోజులుగా వరి పంట నూర్పిడి చేసిన రైతులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మద్దతు లభిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.

మునగాల నారాయణ గూడెం కృష్ణానగర్, గణపవరం, తిమ్మారెడ్డి గూడెం, కొక్కిరేణి గ్రామాలకు కొంతమంది రైతులు 10, 15 రోజుల నుంచి నూర్పిడి చేసిన ధాన్యాన్ని మండల కేంద్రంలో తీసుకువచ్చి ఆరబెట్టుకున్నారన్నారు. ఇప్పటికే 60, 70% రైతులు వరి నువ్వు ఇప్పుడు చేయించి ధాన్యం అమ్ముకోనందుకు సిద్ధం చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ఆఫీసర్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రోజు వస్తున్న మబ్బులు వర్షాలతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చోట రైతుల ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయిందని తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత ఆఫీసర్లు తక్షణమే స్పందించి మునగాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.