18 August, 2026 | 12:57 PM

Breaking News

ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •  

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం

18-08-2026 12:15 PM

సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు శివారులో మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక కార్మికుడు సజీవదహనమయ్యాడు. రాత్రి దుకాణంలో నిద్రించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక వలస కార్మికుడు మృతి చెందాడు. దుకాణంలో ఉన్న బెడ్లు, సోఫాలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచన. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.