06-12-2025 07:31:42 PM
ఉర్దూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సన్మానించిన జర్నలిస్ట్ లు..
మహబూబ్ నగర్ టౌన్: టియుడబ్ల్యూజే (ఐజియు) మహబూబ్ నగర్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియా పాయింట్ దగ్గర సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉన్నారు.