calender_icon.png 6 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

06-12-2025 07:33:11 PM

మానకొండూర్ (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు దాసం కమలాకర్, దొంత శ్రీనివాస్, దాసం నాగేందర్, కర్ర కిషన్, కుంభాల లింగయ్య, దాసం రమేష్, మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ రౌతు రవికుమార్, గట్టేపల్లి దిలీప్ కుమార్, యువజన సంఘం నాయకులు దాసం ప్రేమ్ కుమార్ వొద్దమల్ల కౌశిక్ ముత్తమల్ల నిఖిల్, హనుమండ్ల ప్రవీణ్, సింగిరెడ్డి స్వామి రెడ్డి, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, జాప రత్నాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తమన్నవేణి రమేష్ యాదవ్, పోలగాని మహేష్, కాత కొమరయ్య, తదితరులు  పాల్గొన్నారు.