calender_icon.png 6 December, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లను చైతన్యం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

06-12-2025 07:29:35 PM

కుబీర్ (విజయక్రాంతి): ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో జరుగుతున్న జీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు విలువ తెలుపుతూ కుబీర్ మండలంలోని పాలసీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మేకల లింగమూర్తి ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎన్నికల సందర్భంగా ఓటు విలువ మద్యం మందుకు అమ్ముడుపోతే కలిగే పర్యవసనాలు జీపీ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే అభ్యర్థిని ఎలా ఎన్నుకోవడం బేరసారాలు లీడర్ల పనితీరుపై చైతన్యం కలిగిస్తూ కవితలను రాసి సోషల్ మీడియాలో అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడు రాసిన కవితలు ఇప్పటికే మండలంలో చర్చనీయాంశంగా మారాయి.