3 May, 2026 | 2:12 PM

ఘనంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ మహోత్సవం

09-08-2025 04:57 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి(Raksha Bandhan) పండుగను పురస్కరించుకుని శనివారం కాగజ్ నగర్ పట్టణ భవన కమిటీ ఆధ్వర్యంలో  ఎల్లా గౌడ్ తోటలోని పద్మశాలి కమ్మునిటీ హల్ లో పద్మశాలి కులబాంధవుల సామూహిక యజ్ఞోపవీత ధారణ మహోత్సవం నిర్వహించారు. పద్మశాలి కులబాంధవులందరు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి, మార్కండేయ, ప్రత్యేక పూజా కార్యక్రమం, అభిషేకము, గాయత్రి హోమం నిర్వహించి సామూహిక యజ్ఞోపవీత ధారణ వేడుకలు ఘణంగా జరుపుకున్నట్లు కాగజ్ నగర్ పట్టణ భవన నిర్మాహణ అధ్యక్షులు సిందం చంద్రయ్య తెలిపారు.

కంపెళ్లి సుదర్శన్ దంపతులు నిర్వహించిన పూజ, హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపెళ్లి సదానందం, గుల్లపెళ్లి నాగేశ్వరరావు,వడ్నాల వెంకన్న,గడదాసు మల్లయ్య, దుబ్బు శంకర్, నల్ల కనకయ్య, వనమాల రాములు, సిందం శ్రీనివాస్,అల్లి గురువయ్య, వనమాల బుచ్చయ్య, వనమాల కన్నయ్య, వనమాల రాజన్న ,భోగ వెంకటేశం, పద్మశాలి కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు.