09-08-2025 05:02:38 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై రాజేంధర్, బోడు ఎస్సై శ్రీకాంత్ లను బోడు గ్రామానికి చెందిన దొర కుంజ సాంబయ్య, పటేల్ మాడే లాలయ్య, పెద్దమనిషి పొదెం మల్లయ్య, తుడుందేబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తి సత్యనారాయణల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఈది గణేష్, పోశాలు, ఎట్టి నర్సింహారావు, కుంజా వీరభద్రం, మాడె బాబు, సమ్మయ్య, ఈసాల రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.