09-08-2025 04:53:49 PM
- విజయక్రాంతి కథనానికి స్పందన..
- అవినీతి వ్యవహారంలో అనుముల ఇంచార్జ్ తహసీల్దార్ రఘు తొలగింపు
- రెగ్యులర్ తహసీల్దారుగా శాంతి లాల్ నియామకం
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): అనుముల తాహసీల్ ఆఫీసులో లంచావతారులు అనే శీర్షికన ఈనెల 7న విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) స్పందించారు. దీంతో అనుముల తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి తహసీల్దారుగా పనిచేస్తున్న వై. రఘును తహసీల్దార్ బాధ్యతల్ని తొలగించి, నూతన తహసీల్దార్ గా శాంతిలాల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో సూపర్డెంట్ గా పనిచేస్తూ బదిలీపై అనుములకు వచ్చారు. ఇప్పటివరకు అనుమలలో ఇన్చార్జ్ తహసీల్దార్ గా పనిచేసిన వై. రఘు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో, విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ విషయంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణపై విజయక్రాంతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి అనుముల తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాల వ్యవహారంపై పురుషాలు విచారణ జరిపి నివేదిక రూపొందించారు. దీంతో ఆయన్ని ఇన్చార్జి తాసిల్దార్ బాధ్యతల నుంచి తొలగించి, ఫుల్ ఛార్జ్ అనుముల తాసిల్దార్ గా శాంతి లాల్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకైనా పదవి బాధ్యతలను స్వీకరించారు. రైతుల నుంచి ప్రజల నుంచి ముక్కుపుండి ముడుపులో వసులు చేస్తున్న అనుముల తాసిల్దార్ కార్యాలయం లో జరుగుతున్న అవినీతి పై విజయ క్రాంతి ప్రచురించిన కథనంతో ఎంతో మేలు జరిగిందని పలువురు విజయక్రాంతి పత్రికకు అభినందనలు తెలిపారు.