4 April, 2026 | 2:46 AM

దొడ్డి కొమరయ్యకు ఘన నివాళి

04-04-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు స్వాతంత్య్ర సమరయోధులు దొడ్డి కొమురయ్య కురుమ జయంతి సందర్భంగా మేడ్చల్ లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరివిముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరుడిగా పేరుగాంచారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు గౌర్ల మధు.కురుమ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర్ల ఎల్లయ్య యాదవ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్.మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లు బత్తుల శివ కుమార్ యాదవ్ నాయకులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్.చీర్ల బాలప్ప.సర్ది ప్రకాష్ రెడ్డి.గర్దాస్ నరేందర్.

గుండ్లపోచంపల్లి పట్టణ మాజి ఉప సర్పంచ్ సాయిపేట యాదగిరి కురుమ.మాజీ వార్డ్ సభ్యులు కౌడె నాగేందర్.మున్సిపల్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి.ఎన్.ఎస్.యు.ఐ పట్టణ అధ్యక్షులు గుండ శ్రీధర్ కుర్మ.దండు శ్రీకాంత్.వేముల రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో..  

మేడ్చల్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఇన్చార్జి డి ఆర్ ఓ చంద్రావతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఝాన్సీ రాణి తదితరులు కొమురయ్య సేవలను కొనియాడారు.

1946లో జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య కీలకపాత్ర పోషించారని, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గొంగల్లా తిరుపతి, వెంకటేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.