ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా..
19వ వార్డు కౌన్సిలర్ కల్లెంల జగపతి
మొయినాబాద్ ఏప్రిల్ 3(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ కల్లెంల జగపతి మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీను అమలు చేస్తానని కౌన్సిలర్ కల్లెంల జగపతి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన తల్లి దీవెన పథకం ద్వారా వార్డులోని అర్హులైన ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.41వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నాడు 19వ వార్డుకు చెందిన వజ్రలింగం హేమలత దంపతుల కుమార్తె అయిన సింధూజ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన వంతు బాధ్యతగా రూ.41వేల రెండవ చెక్కును సింధూజ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లెంల జగపతి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక హామీని అమలు పరుస్తానన్నారు. తల్లి దీవెన పథకం ద్వారా అర్హులైన ప్రతి ఆడబిడ్డ పెళ్లికి సొంత అన్నగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు




