4 May, 2026 | 2:11 AM

హిందువులను ఏకతాటిపైకి తెచ్చే మహాయజ్ఞం

04-05-2026 01:03 AM
  1. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనం తో జనంలోకి...
  2. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఉప మండలాల్లో  ఘనంగా హిందూ సమ్మేళనాల నిర్వహణ

మనకొండూర్, మే3(విజయక్రాంతి): రా ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 1925 విజయదశమి నాడు డాక్టర్ కేశవ్ బలి రామ్ హెడ్గేవార్ చేత స్థాపించబడింది. 20 25 విజయదశమి నాటికి ఆర్‌ఎస్‌ఎస్ వం దేళ్ళ ప్రస్తానాన్ని పూర్తి చేసుకుంది. నాగపూర్ లో ప్రారంభమైన ఈ సంస్థ అభివృద్ధి దేశవ్యాప్తంగా  క్రమశిక్షణ , దేశభక్తి, సామాజిక సేవను లక్ష్యంగా చేసుకొని కోట్లాది మం ది స్వయంసేకులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛ ఎదిగింది.

1925 లో హిందూ సమాజాన్ని ఏకం చేయడం, జాతీయతను పెం పొందించడం, దేశాన్ని సాంస్కృతికంగా బలోపేతం చేయడం మే ప్రధాన లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడింది. ప్రస్తుతం సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ నేతృత్వం లో పంచ పరివర్తన్, సామాజిక ఐక్యత, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా వివిధ కార్య క్రమాల తో ముందుకు కొనసాగుతుంది. ఆ దిశలోనే నేడు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాల నిర్వహణతో జనంలోకి వెళ్ళింది.

కు లాల పేరిట విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే సంకల్పంతో మహా యజ్ఞం చేపట్టింది. హిందూ సమ్మేళనాల ను ఆర్‌ఎస్‌ఎస్ ఖండ ల వారిగా అన్ని ఉప మండలాల్లో విస్తృతంగా నిర్వహిస్తుంది. హిందూ సమ్మేళనాల తో ముఖ్యంగా హిం దువులందరినీ ఏకతాటి పైకి తీసుకురావడం, సంఘటితశక్తి ప్రదర్శించడం , సనా తన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం , భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక విలువలను అందించడం, గ్రామాల్లో హిం దూ ధర్మ చైతన్యాన్ని పెంచడం , బలోపేతం చేయడం లాంటి అంశాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది.

హిందూ సమ్మేళనం కార్యక్రమం పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ఆయా ఉప మండలాల్లో చేపడుతున్న హిందూ సమ్మేళనాలన్నీ పార్టీలకతీతంగా , ఆయా ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో సమ్మేళన ఉత్సవ సమితి లను స్థానికంగా ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ సమ్మేళనాల్లో పాల్గొన్న ఎంతోమంది వక్తలు హిందువుల ఐక్యత ఆవశ్యకత గురించి ప్రసంగించారు. అలాగే హిందూ సమ్మేళనల ద్వారాఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లుగా దేశం కోసం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. అలాగే హిందువులందరూ ఏకమై సనాతన ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చింది.

హిందూ ధర్మం , మతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైందని , హిందూ ధర్మాన్ని ఏ ఒక్కరో కనుక్కున్నట్టు ఆధారాలు లేవని , అందుకే సనాతన ధర్మం ఎంతో విశిష్టతను , గొప్పతనాన్ని కలిగి ఉందని ఈ సమ్మేళన ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేసింది. కరీంనగర్ విభాగ్ (కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా) వ్యాప్తంగా 258 ఉప మండలాల్లో,135 బస్తీల్లో ఈ హిందూ సమ్మేళనాలను ఘనంగా నిర్వహించారు. 

హిందూ సమ్మేళనాలు సమాజానికి ఎంతో అవసరం

ఆర్‌ఎస్‌ఎస్ పిలుపుమేరకు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలు హిందూ సమాజానికి ఎంతో అవసరం. హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు సక్రమంగా కొనసాగడానికి, హిందువులంతా ఐక్యంగా ఉండడానికి హిందూ సమ్మేళనం లాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో దోహదం చేసేలా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే హిందువులంతా ఐక్యంగా ఉండే అవకాశం ఉంది.

కన్నం సాయి కృష్ణ, మహాత్మా నగర్ , తిమ్మాపూర్ మండలం

హిందూ సంస్కృతి, జీవన విధానం పురాతనమైంది

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే దిశలో హిందూ సమ్మేళనాలను నిర్వహించడం, హిందువులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం శుభ పరిణామం. హిందువుల ఐక్యతనే దేశానికి బలం. మన సంస్కృతి సాంప్రదాయాలను, రక్షించుకుంటూ, దేవాలయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సంకల్పంతో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలు విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాం.

తిరునగిరి వెంకటాద్రి స్వామి, తపాలా నరసింహస్వామి దేవాలయ అర్చకులు (మహాత్మ నగర్), దూప దీప నైవేద్య కరీంనగర్ జిల్లా కన్వీనర్