చిన్నారుల ఆరోగ్య రక్షణే పల్స్ పోలియో లక్ష్యం
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్, జూన్ 28: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ సమీపంలోని ఎంసిహెచ్ సెంటర్లో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు.
ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగలకుండా ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సంధ్య కిరణ్మయి,వైద్య సిబ్బంది,ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.






