క్రీడలతో ఆరోగ్యకరమైన జీవితం
30-03-2026 12:06 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చ్ 29 (విజయక్రాంతి): క్రీడలతో క్రమశిక్షణ, సహనం, పోరాట స్ఫూ ర్తి పెరుగుతుందని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రజాప్రతినిధులు ఆరోగ్యవంతమైన జీవన విధానా న్ని అవలంబిస్తూ, క్రీడబలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఎల్బీస్టేడియంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ రెండోరోజు క్రీడాపోటీల్లో మల్ల న్న అద్భుత ప్రతిభ కనబరిచారు.
రన్నింగ్, షాట్‌పుట్,జావెలిన్‌త్రో, వాలీబాల్, ఫుట్ బాల్ పోటీల్లో ఫస్టుప్రైజ్ దక్కింది. క్రికెట్, కబడ్డీ, అర్చరీలో సెకండ్‌ప్రైజ్, బ్యాడ్మింటన్ లో తృతీయబహుమతి వచ్చింది. బెస్ట్ ఫ్లేయర్ అవార్డ కూడా మల్లన్నకే వచ్చింది.




