టీసీసీ జిల్లా అధ్యక్షులుగా కుంబర్తి రవీందర్
అభినందించిన డీసీసీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 29 : సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభుత్వ వైద్య,ఆరోగ్య కుటుంబ శాఖలో కమిటీ హెల్త్ ఆఫీసర్ గా సేవలందించి కుంబర్తి రవీందర్ కు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ టిసిసి జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లోని తన నివాసంలో నియామాక పత్రం తో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో రవీందర్ జన్మించి, పెరిగి, విద్యాభ్యాసం చేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చేరి సేవలందించారు.
గత పది సంవత్సరాలుగా సిటిజన్ కౌన్సిల్లో ఎన్నో పదవులు నిర్వహించి కోఆర్డినేటర్ గా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేశారు. గత 40 సంవత్సరాలుగా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్ లో క్షయ, ఎయిడ్స్, మాదకద్రవ్యాల వ్యతిరేకం, పొగాకు, సిగరెట్, గుండె వ్యాధులు,కిడ్నీ, రక్తపోటు, చక్కర వ్యాధి, క్యాన్సర్, పోస్టికారం లో అనేక ర్యాలీలు, అవగాహన శిబిరాలు, సదస్సులు నిర్విరామంగా నిర్వహించి గ్రామీణ ప్రజలలో జాగృతి పరిచారు.
ఈ సందర్భంగా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు A. సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి యువజన, మహిళ విద్యార్థి సంక్షేమ అభివృద్ధి కొరకు నిరుపేదలకు సేవలు అందించి ప్రజలను జాగృతి పరిచాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్యక్రమాలు నిజమైన నిరుపేదలకు అందేటట్లు చూడాలని అన్నారు.
ఈ సందర్భంగా టిసిసి మహబూబ్నగర్ జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాల్లో తమ వంతు మరియు కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ మిరుదొడ్డి రాజ్ నారాయణ, ప్రముఖ సంఘ సేవకులు బ్రహ్మకుమారి సమాజ సమన్వయకర్త శ్రీ శివకుమార్, టిసిసి కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, శ్రీ బిచ్చుకారి సూర్య తదితరులు రవీందర్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.




