తాబేళ్ల అక్రమ విక్రయదారుడి అరెస్ట్
30-03-2026 12:03 AM
శేరిలింగంపల్లి, మార్చి 29 (విజయక్రాంతి): డబ్బు కోసం తాబేళ్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన యువకుడిని చందానగర్ పోలీసులు పట్టుకున్నారు. గౌతమీనగర్కు చెందిన అవైజ్ (24) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశీ జాతికి చెందిన రెడ్ ఇయర్ తాబేళ్లను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తిం చారు. అతని వద్ద నుంచి నాలుగు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




