22 March, 2026 | 11:39 PM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

17-12-2025 12:54 AM
  1. 8 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొని మంటలు
  2. 13 మంది సజీవ దహనం.. మరో 75 మంది క్షతగాత్రులు
  3. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘటన
  4. ప్రమాదానికి దట్టమైన పొగమంచే కారణం
  5. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

లక్నో, డిసెంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమా దం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా, 75 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొ ని మంటలు చెలరేగడంతో ఈ ఘోర విపత్తు సంభవించింది.

యమునా ఎక్స్‌ప్రెస్ జాతీ య రహదారి మార్గంలోని ఆగ్రా క్యారేజ్ మార్గంపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు వల్ల వాహనాలు ఒకదాని ఒకటి ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, వాహనాలు నిమిషాల్లోనే దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు తప్పించుకునేందుకు కూడా వీలు లేకపోయింది.ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో అన్ని వాహనా లు దాదాపు తక్షణమే మంటల్లో చిక్కుకున్నాయి, ప్రయాణికులు బస్సుల్లోనే చిక్కుకొని పోయారని, సంఘటన స్థలంలో భ యాందోళనలు చెలరేగాయి..

ఒక వాహనం నుంచి మరొక వాహనంలోకి మంటలు వేగంగా వ్యాపించడంతో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ప్ర మాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బం ది, పోలీసు బృందాలు, అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

రెస్క్యూ బృం దాలు ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, అగ్నిమాపక సి బ్బంది మంటలను అదుపు చేశారు.దాదాపు 25 మందిని చికిత్స కోసం మధుర, పొరుగు జిల్లాల్లోని ఆస్పత్రులకు తరలించారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపో యింది. అత్యవసర సిబ్బంది శిథిలాలను తొలగించారు. 

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై సంభవించిన ఘోర ప్రమాదంపై ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశా రు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ ప్రమాదాలకు గల కారణాలను ఆరా తీశారు. దుర్ఘ టనలో 13 మంది మరణించడం చాలా బా ధాకరమని పేర్కొన్నారు.

మృతుల కుటుం బాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమం త్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.