calender_icon.png 17 December, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా

17-12-2025 12:47:45 AM

  1. సీఎం మమతకు రాజీనామా లేఖ
  2. మెస్సీ ఈవెంట్ వైఫల్యం నేపథ్యంలో నిర్ణయం

కోల్‌కతా, డిసెంబర్ 15: పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీ వల అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మంత్రి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్టేడియంలో జరిగిన అల్లర్ల విషయంలో మంత్రి అరూప్ బిశ్వాస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపినట్లు ఆయన తెలిపారు. స్టేడియంలో సంభవించిన ఉద్రిక్తతలపై న్యాయబద్దంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు అరూప్ బిశ్వాస్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తునకు ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం విచారణ కమిటీని నియమించింది. డీజీపీ రాజీవ్‌కుమార్, బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్‌కుమార్, యువజన వ్యవహారాల క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజే ష్‌కుమార్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలనిఆదేశించింది. బిధాన్‌నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనీష్ సర్కార్‌ను సస్పెండ్ చేసి, చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.