గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం
బంగారు కొండ!
- 500 మంది వద్ద కోట్లు వసూలు చేసి పరారీ
- ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి కోటి వరకు వసూలు
- బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): నగరంలో రోజుకో కొత్త రకం మోసం వెలుగుచూస్తోంది. కొంత మంది అధిక డబ్బు వస్తుందనే ఆశతో పెట్టుబడులు పెట్టి నిండా మునుగుతు న్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ పేరుతో ప్రజలను మోసం చేస్తుంటే.. మరికొందరు అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. తాజాగా గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలు గుచూసింది.
సుమారు 500 మందిని దాదాపు రూ.౧౫౦ కోట్ల మేర మోసగించి రెండు నెలలుగా తప్పించు కుని తిరుగుతున్న వ్యాపారి రాజేశ్‌ను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బాధి తులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. హబ్సి గూడ స్ట్రీట్ నంబర్ 8లో ‘ప్రహణేశ్వరి’ పేరుతో బెంగళూరుకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు.
గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి పరార య్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పెట్టుబడిగా పెట్టిన డబ్బు ను ఐదు నెలల్లో రెట్టింపు చేస్తామని, పెట్టుబడిలో 2 శాతం లాభాలను వారాని కోసారి చెల్లిస్తానని నమ్మించి మోసం చేశాడని బాధితులు తెలిపారు. మొదట రెండు నెలలపాటు లాభాలను చెల్లించ డంతో నమ్మకం కలిగి భారీ మొత్తంలో డబ్బులు అతడికి ఇచ్చినట్లు వాపో యారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.






