విచారణ కమిషన్ నుంచి లేఖ అందింది
విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరగాలి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): విద్యుత్ విచారణ కమిషన్ నుంచి తనకు లేఖ అందిందని, వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూ లం ఇచ్చిన వారిపై తన అభిప్రాయం చెప్పాలని కోరిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అందరినీ విచారిస్తే కమిషన్‌కు సమగ్ర సమాచారం వస్తుందని, నాటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు విద్యుత్ అధికారుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకోవాలన్నారు. ఈఆర్సీపై స్టే ఇచ్చిందని ఎన్జీటీని, పర్యావరణ అనుమతులు ఇచ్చిందని పర్యావరణశాఖను విచారణకు పిలవగలరా? అని ప్రశ్నించారు. అందరినీ విచారణకు పిలువకపోతే అది సమగ్ర విచారణకు కాదన్నారు. తాము అడిగిన అంశాలపై విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలు ఏమయ్యాయి..?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా అందించాల్సిందేనన్నారు. వానకాలం ప్రారంభమైనా రైతు భరోసా ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుభరోసా అమలుపై కేబినేట్ సబ్ కమిటీని నియమించాల్సిన అవసరం ఏముందన్నారు. వారం రోజుల్లో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగిలో ఇచ్చిన విధంగానే వానకాలంలోనూ పెట్టుబడి సాయం ఇవ్వాలన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పింఛన్లపైనా సర్కార్ నోరు మెదపడం లేదన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ అని సర్కార్ చెప్పిందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ హామీ అమలుకావడం లేదన్నారు. పథకంపై తొలిరోజుల్లో హడావుడి చేసిన సీఎం రేవంత్ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేయడానికే సీఎం రేవంత్‌రెడ్డి కేబినేట్ సబ్ కమిటీ వేశారని ఆరోపిం చారు.
బీఆర్‌ఎస్ పాలనలో సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడుల్లో ఎంతోమంది క్షతగాత్రులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక మాఫియా వాగులు, నదులను దోచుకుంటున్నా మిన్నకుండిపోతుంద న్నారు. ప్రజల సొమ్మును అక్రమార్కులు దోచుకతింటున్నారని మండిపడ్డారు. ప్రభు త్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.






