18 August, 2026 | 12:28 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

బూందిలో బల్లి

01-07-2026 01:06 AM

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌లో ఘటన

తంగళ్లపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్‌లో కొన్ని ఆహార పదార్థాల్లో చనిపోయిన బల్లి కనిపించింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చందు బాలాజీ స్వీట్ హౌస్‌లో బోంది కారా, రింగ్స్, గాటు వంటి స్నాక్స్ కొన్నాడు. ఇంటికి వెళ్లి చూడగా బోంది కారాలో చనిపోయిన బల్లి కనిపించింది.

దుకాణానికి వెళ్లి ప్రశ్నించగా క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ‘ఇంకో కిలో ఎక్కువ తీసుకోపో‘ అంటూ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా? లేక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.