18 August, 2026 | 1:22 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ

01-07-2026 01:07 AM

గౌరారం రైతు వేదికలో వీసీలో పాల్గొన్న కలెక్టర్ హైమావతి

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతలో లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎవరికి ఎంత వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం.

గజ్వేల్, జూన్ 30: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమాన్ని గౌరారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, రైతులు, అధికారులు వీక్షించారు.

అంశం
వివరాలు
పథకం
రైతు భరోసా
రాష్ట్రం
తెలంగాణ
విడుదల తేదీ
జూన్ 30, 2026
మొత్తం నిధులు
₹9,000 కోట్లు
లబ్ధిదారులు
73.32 లక్షల మంది రైతులు
పంపిణీ కాలం
9 రోజులు

ఈ సందర్భంగా ములుగు డివిజన్ పరిధిలో రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, రైతుల ఖాతాల్లో జమ కానున్న నిధుల వివరాలను వ్యవసాయ శాఖ ఏడీఏ అనిల్ కుమార్ వివరించారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ కలెక్టర్కు తెలియజేశారు. గౌరారం, గజ్వేల్ రైతు వేదికల్లో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

FAQ's

Q: రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి?

A: తెలంగాణ ప్రభుత్వం జూన్ 30, 2026 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీని ప్రారంభించింది. తొమ్మిది రోజుల్లో దశలవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.


Q: రైతు భరోసా డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి?

A: రైతులు తమ బ్యాంకు ఖాతా, మొబైల్ SMS లేదా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి రైతు భరోసా నిధుల స్థితిని తెలుసుకోవచ్చు.


Q: రైతు భరోసా పథకం ద్వారా ఎంత మొత్తం అందుతుంది?

A: ప్రభుత్వం ప్రకటించిన అర్హతల ప్రకారం భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని పెట్టుబడి సాయం అందిస్తుంది.

Related Articles

రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ

రైతు భరోసా వివరాలు సరిచేసుకోవాలి

రెండో విడత రైతు భరోసా ఎప్పుడు?

రైతు భరోసా 20న రెండో విడత

రైతులకు సర్కార్ శుభవార్త..! 30న రైతు భరోసా నిధులు విడుదల

రైతు భరోసా కోసం నిరసన