30 June, 2026 | 9:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

07-02-2026 12:39 AM
  1. ఏఐ పరిస్థితుల్లో కొత్త సంస్కరణలు 
  2. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047 వరకు వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంగా రూపొందించిందని, ప్రపంచంలోనే భారత్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ....ఏఐ జనరేషన్ నడుస్తున్న పరిస్థితుల్లో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. ప్రపంచంలోనే భారత్ మూ డో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని రూపొందించిన బడ్జెట్..అని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారని, 5 వేల కిలో మీటర్ల జాతీ య రహదారులు ఇచ్చామని, పట్ట ణ, గ్రామీణ ప్రాంతాలకు నిధులతో పాటు గ్రాంట్లు ఇచ్చామని తెలిపారు.

ఆత్మ నిర్భర భారత్ కింద తెలంగా ణలోని 42 రైల్వే స్టేషన్లు ఆధునికీకరించామని, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో.. మూ డు హైదరాబాద్‌కే కేంద్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల పట్ల మోదీకి ప్రేమ ఉంది.. మోదీపైన తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉందన్నారు. వీబీజీ రామ్‌జీ వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేశారని తప్పుడు ప్రచారం చేశారని, కానీ బడ్జెట్‌లో గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించామన్నారు.