20 May, 2026 | 6:13 AM

ఆరేళ్లుగా జాడలేని వ్యక్తి ఆచూకీ లభ్యం

20-06-2024 12:05 AM

చదువు నిమిత్తం ఫిలిప్పీన్స్ వెళ్లిన అరుణ్ రెడ్డి అనే యువకుడు  

ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు తల్లి ఫిర్యాదు 

సంగారెడ్డి, జూన్ 19 (విజయక్రాంతి): ఆరేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ దేశా నికి వెళ్లిన వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీ సులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి అతడి ఆచూకీ తెలుసుకున్నామని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపా రు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన వివరాలు వెల్లడించారు. కంది మండల కేంద్రానికి చెందిన సత్యాగామ మాణ్యమ్మ తన కుమారుడు అరుణ్ రెడ్డి (31) ఆచూకీ తెలి యడం లేదని 10 జూన్ 2024న జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యా దు చేశారు. 2012లో ఎంబీబీఎస్ చదివేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లిన అరుణ్ రెడ్డి..

2018లో తన తండ్రి చనిపోవడంతో కంది గ్రామానికి వచ్చి తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. అయి తే అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్ చేసినా స్పందించడం లేద ని, తన కుమారుడి ఆచూకీ కనుగొనాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. దీంతో విచారణ జరిపేందుకు ఐటీ సెల్  సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీఐ మిస్సింగ్ కేసు నమోదు చేసి.. పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్, ఫొటోల సహాయంతో ఇండియాలోని ఫిలిప్పీన్స్ ఎంబసీతో మాట్లాడి అరుణ్ రెడ్డి సమాచారం తెలుసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం మాణ్యమ్మతో ఫోన్‌లో మాట్లా డించినట్లు తెలిపారు.