అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఎంపీ సురేశ్ షెట్కార్
నారాయణఖేడ్, జూన్ 19 (విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. బుధవారం ఎంపీపీ రాథోడ్ మోతీబాయి అధ్యక్షతన నిర్వహించిన నాగల్‌గిద్ద మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. అధికారులు విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు వచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పండరి యాదవ్, జెడ్పీటీసీ రాజురాథోడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేకు సన్మానం..
ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పీ సంజీవ రెడ్డి, ఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కార్‌ను వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో బాల్కి మఠం పీఠాధిపతి బసవ లింగ పట్టెదేవరతో పాటు నాయకులు ఖేడ్‌లోని బసవ మండపంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.






