calender_icon.png 22 February, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా యంత్రాంగం

22-02-2026 12:16:36 AM

రాష్ట్రంలో ఫెయిర్ ఎన్నికలకు అర్థం లేదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : ఎన్నికలు అంటే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అధికార యంత్రాం గం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ర్టంలో ఫెయిర్ ఎన్నికలకు అర్థం లేదని, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్లు ఇంత దుర్మార్గానికి పాల్పడరని అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో అధికారులు కాంగ్రెస్  ఎమ్మెల్యేతో కుమ్మక్కు అయ్యారని, ప్రజల తీర్పును హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఎన్నికకు రాకపోతే కేసు ఆ పార్టీ వాళ్లు పెట్టాలి.. కానీ కాంగ్రెస్ వాళ్లు కేసు పెట్టారని ఆ రోపించారు. ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు సిగ్గు ఉందా అని ప్ర శ్నించారు. 17 వ తేదీన చైర్మ న్ ఎన్నిక పూర్తి అయ్యాక ఎన్నికల ప్రాసెస్ జరగకుండా పోలీసులు అడ్డు కున్నారని, 18న హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా అమలుచేయడం లేదన్నారు.

ఇబ్రహీంప ట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై కేసులు పెట్టారని, పోలీసులు రేవంత్‌రెడ్డికి తొత్తులుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో చైర్మన్‌ను ప్రకటించాలి, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా లని, ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్‌ను ఇబ్బందులు పెడుతున్నారని, సరైన ఆహా రం, నీరు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ముక్కు నేలకు రాసినా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో గెలవలేదన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక ల్లో మాకు పూర్తి మెజారిటీ ఉన్నా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.