calender_icon.png 22 February, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డిది అరాచక పాలన

22-02-2026 12:13:57 AM

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డిది ప్రజాపాలన, ఇంది రమ్మ రాజ్యం కాదని, అరాచక, రాబందుల పాలన బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఎన్నికల కమిషన్ అధికారపార్టీ కనుసన్నల్లో పనిచేస్తుందని, రాష్ర్టంలో మొత్తం 36 చోట్ల హంగ్ వస్తే.. ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు.

కల్వకుర్తి నియోజకవర్గం, ఆమన్‌గల్ మున్సిపాలిటీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో భాగంగా అరెస్ట్ అయి చంచల్‌గూడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఆర్‌ఎస్ ప్రవీణ్ ములాఖత్‌లో కలిశారు. అనం తరం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ... ఆమన్‌గల్‌లో ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురైందని, కాంగ్రెస్‌కు అక్కడ కేవ లం ఒకటే సీటు వచ్చినా కల్వకుర్తి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబ ట్టి జిల్లాలో ఎలాగైనా చైర్మెన్ పదవి దక్కించుకోవాలని అక్రమాలకు పా ల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు ఆచారి కలిసి పోలీస్ స్టేషన్‌లో కూర్చుని అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల రోజు పోలీసులను తిట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గా రెడ్డి ఢిల్లీలో ఉన్నారని, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడితే బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం అట్రాసిటీ కేసుల్లో జైలుకు పంపారని మండిపడ్డారు. పోలీసు అధికారులు చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి పని చేయడం లేదని ఆయన విమర్శించారు.