3 August, 2026 | 2:45 AM

అమీర్ లోగ్ నుంచి కొత్త పాట

03-08-2026 01:54 AM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవిరెడ్డి సోమ నిర్మించిన తొలిచిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు.

స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్టు 21న రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘కాసుల కళ వేరే అంట’ అనే పాటను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మిడిల్ క్లాస్ బతుకులకు అద్దం పట్టేలా సాగుతున్న ఈ పాటకు స్మరణ్‌సాయి స్వరకర్త. ఈ పాటను నిఖ్లేష్ సుంకోజి రాయగా, ఏక్‌నాథ్ పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: ఎస్‌వీకే; సంగీతం: స్మరణ్ సాయి; ఎడిటర్: రోహిత్ పెనుమత్స.