30 July, 2026 | 6:03 AM

బిల్డర్ హత్య కేసులో కొత్త కోణం

29-05-2024 01:34 AM

మేడ్చల్, మే 28 (విజయక్రాంతి) : కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో జరిగిన బిల్డర్ హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఈ హత్య జరిగింది డబ్బుల కోసమా..? ప్రేమ వ్యవహారమా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పద్మానగర్ ఫేజ్ 1కు చెందిన కుప్పాల మధు(45) గతంలో మణికంట ట్రావెల్స్ నిర్వహించేవాడు. ఇటీవల బిల్డర్ అవతారమెత్తాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే, మధు ఈనెల 24వ తేదీన చింతల్ కల్పన సొసైటీకి చెందిన రేణుకాప్రసాద్, నిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి, వరుణ్ అలియాస్ కన్నా అనే ముగ్గురు స్నేహితులతో బీదర్‌కు వెళ్లి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, రేణుకాప్రసాద్ గతకొన్ని రోజుల క్రితం మధు కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.

ఆ కోపంతోనే రెండు నెలల క్రితం సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. అయితే, హత్యాయత్నం విఫలం కావడంతో 24వ తేదీన బీదర్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ప్రేమను వ్యతిరేకించడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డారా? లేదా అతని వద్దనున్న నగ దుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం హత్య చేశారా? అనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం డబ్బు లు, నగదు కోసమే హత్య చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మధు చీకోటి రాముకు అనుచరుడుగా స్థానికులు చెబుతున్నారు. వీరంతా పత్తాలు, క్యాసినో ఆడుతా రని, ఆ వ్యవహారంలోనే హత్య జరిగిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు ్త చేస్తున్నారు.