30 July, 2026 | 6:44 AM

అమ్మవార్లను దర్శించుకున్న సబితా ఇంద్రారెడ్డి

29-05-2024 01:29 AM

మహేశ్వరం, మే 28: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావి ర్యాల గ్రామంలో వెలిసిన శ్రీ సూర్యగిరి ఎల్ల మ్మ అమ్మవారిని మంగళవారం మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.