5 May, 2026 | 4:14 AM

ఆధ్యాత్మిక చింతనతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం

05-05-2026 01:36 AM

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు, మే4: ఆధ్యాత్మిక అలవాట్లు పెంపొందించుకోవడం వల్ల పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రజలకు ఆధ్యాత్మిక జీవన విధానం అవసరాన్ని గుర్తుచేశారు.

కిష్టాపురం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి మహోత్సవం, ఇప్పర్తి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ నూతన దేవాలయ ఉత్సవాలు, ఊకోండి గ్రామంలో గంగా దేవుని ఉత్సవాల్లో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. పండుగలు గ్రామాల్లో ప్రేమానురాగాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

కుటుంబ వ్యవస్థ బలోపేతానికి, బంధుత్వాల మరింత బలపడేందుకు ఇటువంటి ఉత్సవాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో కిష్టాపురం సర్పంచ్ మాలగ శ్రీను, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, మాజీ జెడ్పిటిసి జాజుల అంజయ్య, మునుకుంట్ల మల్లయ్య, ఇప్పర్తి గ్రామంలో సర్పంచ్ చీమల రాజు, మాజీ సర్పంచ్ బొజ్జ శ్రీను, ఉషయ్య, లింగయ్య, ఊకోండి గ్రామంలో యాదవ సంఘం నాయకులు జల్లెల సత్యం, జాల పరమేష్, స్వామి మల్లేశం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.