5 May, 2026 | 4:11 AM

పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

05-05-2026 01:37 AM

పురాతన దేవాలయాలను పరిరక్షించుకోవాలి

మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్

కౌన్సిలర్ కోలా ఉదయభాను 

హుజూర్ నగర్, మే 4: పట్టణభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని  శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ కోలా ఉదయభాను కోరారు. సోమవారం పట్టణంలోని గోవిందపురంలో లక్ష రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారాలతో అభివృద్ధికి  కృషి చేస్తున్నామన్నారు. పురాతన దేవాలయాలను పరీక్షించుకోవాలన్నారు.

గోవిందపురంలోని  భయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. హనుమన్ జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హనుమ జయంతి సందర్భంగా దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గోవిందపురంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోలపాటి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, చిలకబత్తిని సౌజన్య ధనుంజయ్, గొర్రె వీరబాబు, బండారు శ్రీనివాసు తోకల ప్రభాకర్ గట్టు నాగేశ్వరరావు, పిచ్చయ్య పాల్గొన్నారు.