రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
22-03-2026 12:00 AM
మేడిపల్లి, మార్చి 21 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావన్ కాలనీలో నివసించే బండారి నరసింహులు(48) కాలనీలో బర్బర్ షాపు నడుపుతున్నాడు. ఈ నెల 19న షాప్ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి పల్సర్ బండిపై వెనుకనుండి నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ నరసింహులును డికొట్టాడు. కిందపడిన అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతనిని అభయ్ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. మృతుని కుమారుడు ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ శంకరయ్య తెలిపారు.




