ఆ ఒక్కటీ అడక్కు!
- వైన్ షాపుల వద్ద మందుబాబులకు తరచు వినిపిస్తున్న మాట
- వైన్స్ లలో బ్రాండ్ మందులు బంద్.
- బెల్టు షాపులలో అన్నీ కనువిందు
- ఒక్కొక్క మద్యం సీసాపై అదనంగా 25 రూపాయలు బాదుడు
- నెలవారి మామూళ్ల మత్తులో సంబంధిత శాఖ అధికారులు
- మత్తులో చిత్తవుతున్న కూలీల బ్రతుకులు
మోతె, ఏప్రిల్ 12: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఉర్లు గొండ వై న్స్ షాపుల నిర్వాకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల అండదండలతో మద్యం విక్రయాలు కొనసాగిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు లాగా అందిన కాడికి దండుకుంటున్నారు. వైన్ షాపులు బెల్ట్ షాపులకు కొద్దిమేర అధిక ధరలకు అమ్మగా.. బెల్టు షాపుల నిర్వాహకులు మరో 25 రూపాయలు జత చేసి అమ్ముతున్నారని. వైన్స్ షాపులలో డిమాండ్ ఉన్న మద్యాన్ని అమ్మడం లేద ని మద్యం బాబు లు బహటంగానే చెబుతున్నారు. కావలసిన బ్రాండ్ పేరు అడిగితే ఆ ఒక్కటి అడక్కు అనే సమాధానం వినిపిస్తుందని నిర్వాహకులపై మండిపడుతున్నారు.
అన్ని బ్రాండ్ల బెల్టు షాపులోనే
మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఉర్లుగొండలో ఉన్న వైన్స్ షాపులలో ఎమ్మార్పీ ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. అన్ని బ్రాండ్లు మద్యం ప్రియులకు సరఫరా చేయాల్సి ఉండగా అలా సరపర చేస్తే బెల్టు షాపులు ఎలా నడుస్తాయి తమ పెట్టుబడి త్వరగా రావాలనే ఆలోచనతో వైన్స్ షాపుల నిర్వాహకులు కొన్ని మద్యం బ్రాండ్లనే అందుబాటులో ఉంచి విక్రయిస్తూ విడివిడిగా అమ్ముడయ్యే బ్రాండ్లను స్టాక్ పాయింట్ ద్వారా బెల్టు షాపులకు సరపర చేస్తూ దండిగా లాభాలు ఆర్జిస్తున్నారని, బాహటంగానే చర్చించుకుంటున్నారు.
మామూళ్ల మత్తు అధికారులు
వైన్స్ షాపుల నిర్వాహకులు ఇచ్చే నెలవారి మామూళ్లతో సంబంధిత ఎక్సైజ్ శాఖ. మండల అధికారులు మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్న. వైన్స్ షాపులలో అన్ని బ్రాం డ్లు దొరకకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, తమకేం సంబంధం లేనట్లు నిద్ర వ్యవస్థలో జోగుతున్నారని , గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల వారికి వైన్ షాపుల నిర్వాహకులు మామూలు ముట్టజెప్పి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ తమ పని తాము చక్క పెట్టుకుంటున్నారని బాహటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
మత్తులో చిత్తవుతున్న కూలీల బ్రతుకులు
రెక్కాడితే గాని డొక్కాడని రోజువారి కూలీలు పొద్దంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా బెల్టు షాపులలో, వైన్స్ షా పులలో ధారాపోస్తుంటే తమ కుటుంబాలు ఎలా బాగుపడతాయని నిరుపేద కుటుంబాలలోని మహిళలు తమ గోడును ఎవరికి చె ప్పుకోవాలో తెలియక దీనమైన స్థితిలో తమ రోజు వారి బ్రతుకులను నెట్టుకొస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న తమ మగవారితో రోజు వాగ్వాదాలతో కుటుంబాలు చిన్న భి న్నమవుతున్నాయని వాపోతున్నారు.
ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై, వైన్స్ షాపుల నిర్వాహకులపై, చట్టరీ త్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, పలు రాజకీయ నాయకులు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మద్యం సేవించిన వారితో ఇబ్బంది కలుగుతుంది
గ్రామాలలో బెల్ట్ షాపులు ఇష్ట రాజ్యంగా ఏర్పా టు చేయడంతో వాటిలో మద్యం ప్రియులు బాగా సేవిస్తున్నారు. ఈ బెల్టు షాపులు రాత్రి 11 గంటల వరకు నడుస్తుండడంతో మద్యం తాగిన వారు చేసే గోలకు ఇళ్లలో నిద్రించుతున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే వీధులలో ఇండ్ల ముందు మలమూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో బీదలు వెంట నడవాలంటే ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు బెల్ట్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.
కారింగుల శ్రీనివాస్ గౌడ్, రాఘవపురం ఎక్స్ రోడ్
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
ఏ గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, వాటి వల్ల ఎటువంటి ఇబ్బం దులు ఎదురవుతున్నాయి అనేది మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం
మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, సూర్యాపేట




