5 June, 2026 | 5:45 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

ఇంటర్ ఫలితాల్లో జయ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం

13-04-2026 12:00 AM

సూర్యపేట, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జయ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించి ప్రభంజనం సృష్టించారని జయ కలాశాల నిర్వాహకులు తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో 460 కి పైగా 43 మందికి, 450 పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు.

బైపిసి మొదటి సంవత్సరంలో యం. ప్రగతి ఇవాంజలిన్ 440 మార్క్ లకు గాను 438 మార్కులు  సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఎంపీసీ రెండవ సం.లో 980 పైన 32 మంది, 950 పైన 109 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు, స్టాప్ తదితరులు పాల్గొన్నారు.