calender_icon.png 12 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండుకుండలా చెరువు

12-11-2025 12:26:49 AM

  1. భూగర్భంలో జలసిరి

రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ జలాలు

వచ్చే వేసవికి డోకా లేదు

నిర్మల్, నవంబర్ ౧౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భూగర్భంలో జలసిరి సంతాదించుకుంది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 35 శాతం అధిక వర్షం కురవడంతో నిర్మల్ జిల్లాలో భూగర్భ జిల్లాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జల గణాం క శాఖ వెల్లడించింది. జిల్లావ్యాప్తంగా 42చోట్ల డిజిటల్ వాటర్ మీటర్లను ఏర్పాటు చేయగా ప్రతినెల భూగర్భ జిల్లా శాఖ అధికారులు శాటిలైట్ సహకారంతో భూగర్భ జిల్లాలను లెక్కించి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.

జిల్లాలో జూలై మాస నుంచి నవంబర్ చివరి వరకు వర్షాలు కురవడం వల్ల చెరువులు వాగులు నిండుకోవడం ప్రాజెక్టును నిండుకోవడం చెక్ డ్యాములు ఊట కుంటలు నిం డుకోవడంతో భూగర్భ జలా పెంపుకు ప్రధాన కారణం. జిల్లాలో ప్రస్తుతం 3.26 మీటర్లకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో 4.84 మీటర్ల భూగర్భజలం ఉండ గా ఈసారి అదనంగా 1.58 మీటర్లు భూగర్భజలం వృద్ధి చెందినట్టు అధికారులు తెలిపా రు.

ది భూగర్భ జలం మే నెలలో పోలిస్తే మే నెలలో 10.95 మీటర్లు ఉండగా ప్రస్తుతం 3.26 మీటర్లకు చేరుకుంది అంటే 7.69 మీటర్ల భూగర్భజలం వృద్ధి చెందిందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం డిసెంబ ర్లో 4.28 మీటర్లు ఉండగా ఈసారి రెండు మీటర్ల వరకు వృద్ధి సాధించడం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ వానాకాలం సీజన్లో 993 మిల్లీ మీటర్ల వర్షాపదం కురువలసి ఉండగా 13:45 మీటర్ల వర్షపాతం నమోదయింది సగటున కురువాల్సిన వర్షం కంటే 35% అధిక వర్షం కురవడం వల్లనే భూగర్భ జలాలను వృద్ధి చెందినట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ బాబు తెలిపారు.

తాగు, సాగునీటికి డోకా లేదు

నిర్మల్ జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధి గణనీయంగా పెరగడంతో ఎండాకాలం సీజ న్లో తాగునీరు సాగునీరు ఎలాంటి ఇబ్బంది ఉండదని భూగర్భ జిల్లా అధికారులు చెప్తున్నారు. నిర్మల్ జిల్లాలో వేసవికాలంలో చెరు వులు తోపాటు శ్రీరాంసాగర్ కడెం నారాయణరెడ్డి స్వర్ణ గడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్టుల తో పాటు ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ పంట శైలు వేసుకున్న తాగునీటి వ్యవసాయ బోరు పంపులపై వ్యవసాయం చేస్తున్న రైతులకు వృద్ధి చెందిన జిల్లాలు పంటలకు ప్రయోజనకరంగా ఉంటాయని రైతులు విశ్వసిస్తున్నారు .

అయితే భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా భూగర్భలే శాఖ అధికారులు. తెలిపారు ఇందుకోసం నిర్మల్ జిల్లాలో భూగర్భజల శాఖ ఇతర శాఖలకు సం బంధించి లాల వినియోగం సంరక్షణపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించేం దుకు ప్రణాళిక రూపొందించినట్టు భూగర్భ జలశాఖ అధికారి శ్రీనివాస్‌బాబు తెలిపారు.