12-11-2025 12:26:02 AM
సమాచారం ఇవ్వకుండా ప్రకటించడం పట్ల అసహనం
భద్రాద్రికొత్తగూడెం, నవంబర్ 11, ( విజయ క్రాంతి) : టిఆర్‌ఎస్ పార్టీలో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల్లో బిఆర్‌ఎస్ కమిటీలను జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ప్రకటించిన విషయం విధితమే. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కమిటీలు ప్రకటించడానికి కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తప్పుపట్టారు.
మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో నియోజకవర్గం పరిధిలోని చుంచూపల్లి మండలం-1,చుంచూపల్లి మండలం - 2 శాఖలకు మండల అధ్యక్షులను, సుజాత నగర్ మండలం కు నూతన అధ్యక్షులను బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కనీసం తనను సంప్రదించ కుండా తను నియోజకవర్గం ఇంచార్జీ గా ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా కమిటీలు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తన రాజకీయ జీవితం లో వార్డ్ మెంబర్ నుండి మంత్రి గా పనిచేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి గా పని చేసిన. తాను ఎప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదని, పార్టీ లో గ్రూప్ రాజకీయలు చేసి పార్టీ లో చిలిక తెచ్చే పనులు చేయలేదని, పార్టీ క్యాడర్ ను అయోమయం కు గురి చేయలేదన్నారు. తెలంగాణ బాపు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు తుచాతప్పకుండా పాటిస్తు కొత్తగూడెంకు నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానన్నారు.
ఇలా తనను సంప్రదించ కుండా జిల్లా అధ్యక్షులు పదవులు పంపచం సరైన సంస్కృతి కాదని జిల్లా అధ్యక్షుడు చేసిన ఈ పని తన తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ అధిష్టానం దృష్టి కి ఈ విషయం తీస్కో వెళ్తానని ఈ కమిటీలు రద్దు చేయించి, పార్టీ క్యాడర్ అభిష్టం మేరకు నూతన కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు.