calender_icon.png 12 November, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేపై అపోహలకు గురికావొద్దు

12-11-2025 12:27:49 AM

విజయక్రాంతి విలేకరితో తహసీల్దార్ గొంది గోపాలకృష్ణ

పినపాక, నవంబర్ 11: దేశవ్యాప్తంగా జనగణన నమూనా సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సర్వేను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో యాప్ ద్వారా నిర్వహిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని 7 రెవిన్యూ గ్రామాలను మోడల్ సర్వేకు ఎంపిక చేసినట్లు తాసిల్దార్ గొంది గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు సర్వే జరుగుతున్న తీరు తెన్నులను విజయక్రాంతి పత్రిక ప్రతినిధి  మంగళవారం కార్యాలయంలో  తహశీల్దార్ ను కలిసిన సందర్భంగా వెల్లడించారు.

మండలంలోని జానంపేట,ఏడుళ్ళ బయ్యారం ,సింగిరెడ్డిపల్లి ,పినపాక, ఎల్చిరెడ్డిపల్లి, అల్లంపల్లి, గడ్డంపల్లి రెవెన్యూ గ్రామాలలో జనగణన  నమూనాసర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ సైతం ఇవ్వడం జరిగింది. ఎంతో పారదర్శకంగా నిర్వహించనున్న ఈ సర్వేకు 6గురు సూపర్వుజర్లు,37 మంది గణకులను నియమించాం. ఈ సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కాకుండా... ఇళ్లకి వచ్చిన ఘణకులకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలన్నారు.

మైక్ , టమక ద్వారా ఒకరోజు ముందే సర్వే చేయనున్న గ్రామస్తులకు సమాచారం అందించడం జరుగుతుంది. ఈ ఫ్రీ టెస్ట్ లో మొత్తం 34 అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఈనెల 30తో  ఎంపిక చేయబడిన 7 గ్రామాలలో జనగణన  నమూనా సర్వే పూర్తి చేస్తాం.  ప్రజలందరూ స్వచ్ఛందంగా నమూనా సర్వేల్లో పాల్గొని విజయవంతం చేయాలి.