25 July, 2026 | 1:47 AM

విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలి

25-07-2026 12:00 AM

ఆలిండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి

పాల్వంచ, జూలై 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ ప్రాంతంలో భూమి బొగ్గు లింకేష్ నేటి వనరులు యాష్ పాండ్ అవసరమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నందున 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది.

ఈ మేరకు శుక్రవారం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మాత్యులు భట్టి విక్రమార్క మల్లును పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో కలిసి వెళితే పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాల్వ భాస్కరరావు, నాయకులు కాల్వ ప్రకాష్ రావు, కాల్వ దేవదాస్, కొత్తపల్లి సోమయ్య, ముండ్లపాటి రాజేంద్రకుమార్ ,దండోరా శీను ,జమాల్ సైదులు తదితరులు పాల్గొన్నారు.