25 July, 2026 | 1:47 AM

కాక్రోచ్ వైపు యువత చూపు!

25-07-2026 12:00 AM

ఉమ్మడి జిల్లాల్లో 9 వేల మంది సభ్యులు

ప్రధాన పార్టీ నాయకుల్లో ఆందోళన

కరీంనగర్, జూలై24 (విజయక్రాంతి): నిరుద్యోగం, పరీక్షల పేపర్ లీకేజీలపై ఆగ్రహంతో ఉన్న యువత సరికొత్త రాజకీయ డిజిటల్ విప్లవంగా మార్చిన ‘కాక్రోచ్ జనతా పా ర్టీ (సి జె పి)‘ వైపు భారీగా మొగ్గు చూపుతోంది. ఇప్పటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా లో 9000 మంది వరకు సభ్యులుగా చేరారంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.

భవిషత్తులో కాంగ్రెస్, బి జె పి కి యువత దూరం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఒక సోషల్ మీడి యా వ్యంగ్య మీమ్ గా ప్రారంభమైన ఈ ట్రెండ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను ఆకర్షించి ఒక రోడ్లపైకి వచ్చి పోరాడే ప్రజా ఉద్యమంగా రూపాంత రం చెందింది. కోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి ‘బొద్దింక లు‘ సమాజ పరాన్నజీవులు అని అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యా ఖ్యలపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన డిజిట ల్ క్రియేటర్ అభిజీత్ దీప్కే దీనికి వ్యం గ్యంగా స్పందిస్తూ మే 16, 2026న ఎక్స్  వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ ని ప్రకటించారు.

ఈ పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అ యి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, రోజంతా ఆన్లైన్లో ఉంటూ ప్రశ్నించే సత్తా ఉండాలి‘ అ ని పెట్టిన పోస్ట్ యువతను విపరీతంగా ఆకట్టుకుందినిరుద్యోగ నిరాశ దేశంలో పెరుగు తున్న నిరుద్యోగ సమస్యతో విసిగిపోయిన యువతకు తమ ఆవేదనను వెళ్లగక్కడానికి ఇది ఒక ప్రధాన వేదికగా మారింది. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవినీతిపై యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తి ఈ ఉద్యమం ద్వారా బయటకు వస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో అధికార పార్టీల కంటే వేగంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించు కుని డిజిటల్ సంచలనం సృష్టించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యువత పో టీ పడి కాక్రోచ్ జనతా పార్టీ లో చేరుతుండటం ప్రధాన రాజకీయ పార్టీలకు ఆందో ళన కలిగిస్తున్న అంశం.