దగ్గుమందుకు ప్రిష్క్రిప్షన్ తప్పనిసరి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ నోటీఫికేషన్ జారీ
దగ్గుమందు కొనుగోలుకు ప్రిస్కిప్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాసిరకం సిరప్‌ల వల్ల చిన్నారుల మరణాలు చోటుచేసుకోవడంతో ఈ నిబంధనలు కఠినతరం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 16: ఇకపై దగ్గుమందు సహా పలు సిరప్‌ల కొనుగోలుకు వైద్యుల ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని ఔషధ నియంత్రణపై ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’తో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది. దీనిని షెడ్యూల్ ‘కె’ డ్రగ్స్ జాబితా నుంచి తొలగించింది.
ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.
నాసిరకం దగ్గుమందుల వల్ల పలువురు చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ చర్యలు చేపట్టింది. గతేడాది మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు కారణంగా 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సంస్థలో తనిఖీలు చేయగా, కోల్డ్రిఫ్ సిరప్‌లో 48.6 శాతం డై ఇథైలిన్ గ్లుకాల్ ఉన్నట్లు తెలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు నిర్ధారించారు. ఆ సిరప్‌పై నిషేధం విధించారు. ఈ ఘటన పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తన హెచ్చరికల్లో పేర్కొంది. దీంతో భారత ఔషధ నియంత్రణ శాఖ కఠిన చర్యలకు దిగింది.
హైదరాబాద్‌కు సంబంధించిన తాజా పరిణామాల కోసం హైదరాబాద్ వార్తలు చదవండి.
FAQ's
Q1: దగ్గుమందు కొనుగోలుకు ప్రిస్కిప్షన్ తప్పనిసరిగా ఎందుకు చేశారు?
నాసిరకం సిరప్‌ల వల్ల చిన్నారుల మరణాలు జరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Q2: ఈ కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
కేంద్ర ఆరోగ్య శాఖ జూన్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది.
Q3: ఏ మందులపై ఈ నిబంధన వర్తిస్తుంది?
దగ్గుమందు సహా పలు సిరప్‌లపై ప్రిస్కిప్షన్ తప్పనిసరి చేశారు.
ఇలాంటి తాజా అప్‌డేట్స్ కోసం లేటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను ఫాలో అవ్వండి.






