17 June, 2026 | 2:16 AM

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

17-06-2026 01:20 AM

మృతుడి సోదరుడి ఫిర్యాదుతో విచారణ

9 మంది అరెస్ట్.. మృతుడి పేరుపై 2 కోట్ల బీమా

బెంగళూరు, జూన్ 16: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తను కొంతమందితో కలిసి భార్య హత్యచేసింది. హత్యగావించబడ్డ వ్యక్తి సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో డొంక మొత్తం కదిలింది. బెళగావి ఎస్పీ బీమా శంకర గుళేద్ తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ కలగౌడ మంజరగి (46) మాజీ సైనికుడు. యమకనమరడిలో భార్య సుమతో కలిసి నివాసం ఉంటున్నాడు. సుమకు పుండలీక డొంబర్ అనే ప్రియుడున్నాడు. సందీప్ పేరుపై రూ. 2 కోట్ల బీమా ఉంది.

భర్త సందీప్ అడ్డు తొలగించుకుంటే, బీమా సొమ్ము చేజిక్కించుకోవడంతో పాటు ప్రియుడితో కలిసి ఉండొచ్చని సుమ భావించింది. సందీప్ మార్చి 13న రోడ్డు ప్రమాదంలో గాయపడి హుక్కేరి ఆసుపత్రిలో చేరాడు. సుమ, పుండలీకలు మార్చి 15న సైలెన్ బాటిల్‌లో విషం కలిపారు. దీంతో సందీప్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఆదరాబాదరాగా అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ సోదరునికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కూపీ లాగారు. సుమతోపాటు మరో 9 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.