17 June, 2026 | 3:46 AM

‘మెడిసిటీ’లో ప్రపంచ రక్తదాన శిబిరం

17-06-2026 02:11 AM

భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు

మేడ్చల్ అర్బన్ జూన్ 16 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిసిటీ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి డాక్టర్ మాన్విత సింధు మా ట్లాడుతూ రక్తదానంపై పలు అపోహలు జరుగుతున్నాయని ఆమే చెప్పారు.

ముక్యంగా రక్తదానం చేసిన వారు నీరస పడిపోతారని వారి శరీరంలో రక్తం తగ్గిపోతుందని ,రోగనిరోధక శక్తి కోల్పోయే ప్రమాదం ఉందనే అపోహలు నిజానికి అవాస్తవమని డాక్టర్ మాన్విత సింధు వెల్లడించారు.

ప్రతియేట జూన్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రక్తదాన శిబిర దినోత్సవాన్ని అన్ని దేశాలలో నిర్వహిస్తారని ఫ్రొఫెసర్ కే శివరామకృష్ణ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల, ఆసుపత్రి సిబ్బందికి రక్తదానంపై అవగాహన నిర్వహించడంతో పాటు సంస్థ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.దీనికోసం మెడిసిటీ ఆసుపత్రిలో మూడు రోజులుగా ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడమే కాకుండా రక్తదానానికి ప్రోత్సహించినట్లు తెలిపారు.

అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారికి ఉచితంగా బ్లడ్ గ్రూప్,హిమోగ్లోబిన్, హెచ్ ఐ వి,హెపటైటిస్-బి,హెపటైటిస్-సి సిఫిల్,మలేరియా మొదలైన పరీక్షలు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మెడిసిటి ఆసుపత్రి పాథాలజీ విభాగపు అధిపతి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి.డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి. డాక్టర్ గీతా.లతో పాటు మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.