calender_icon.png 16 September, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వారీ ఎనర్జీస్ కాసుల వర్షం

29-10-2024 12:22:44 AM

లిస్టింగ్ తర్వాత 10% డౌన్

ముంబై: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ మదుపర్లకు కాసుల వర్షం కురిపించింది. స్టాక్ ఎక్స్చేంజీల్లో సోమవారం దాదా పు 70 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. లిస్టింగ్ అనంతరం లాభాల స్వీకరణతో దాదాపు 10 శాతం క్షీణించినప్పటికీ.. ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారికి మాత్రం దీపావళి ముందు బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లయ్యింది.

వారీ ఎనర్జీస్ ఇష్యూ ధర రూ.1503 కాగా.. బీఎస్‌ఈలో 69.66 శాతం ప్రీమియంతో రూ.2,550 వద్ద నమోదైంది. తర్వాత 72.98 శాతం లాభంతో రూ.2,600 వరకు దూసుకెళ్లింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 66.33 శాతం లాభంతో రూ.2500 వద్ద నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 67,866 కోట్లకు చేరింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో షేరు ధర 10 శాతం మేర కుంగింది.