ఉగాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి..
19-03-2026 02:51 PM
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : ఈ ఉగాది ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy ) ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటింటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభివృద్ధికి నూతన ఒరవడితో అండగా నిలవాలని కోరారు.




