27 July, 2026 | 12:29 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

మెదక్ కలెక్టర్‌కు అరుదైన గౌరవం

20-07-2024 03:15 AM
  • బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు సుపరిపాలనపై శిక్షణ 
  • గతంలో ఉత్తమ కలెక్టర్‌గా ప్రధానమంత్రి అవార్డు 

మెదక్, జూలై 19 (విజయక్రాంతి): మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు అరుదైన అవకాశం లభించింది. బంగ్లాదేశ్ దేశానికి చెందిన డిప్యూటీ కమిషనర్స్‌తో పాటు ఆ దేశంలోని జిల్లాల కలెక్టర్లకు శిక్షణ ఇవ్వడానికి కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీ వెళ్లారు. భారతదేశంలోనే ఉత్తమ కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ గతంలో ప్రధానమంత్రి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఢిల్లీలో.. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా ‘భారతీయ పాల న, ప్రజా విధానం’ అనే అంశంపై బంగ్లాదేశ్ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఆయన్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్.. సుపరిపాల నపై చేపట్టిన చర్యల గురించి బంగ్లాదేశ్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు, ప్రజా ప్రతినిధులు రాహుల్ రాజ్‌కు మెమోంటో అందించి సత్కరించారు.